మమత దిగిపోయే సమయం వచ్చింది.. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

  • మొదటి దశలో 110 స్థానాలను గెలుస్తామన్న అమిత్ షా
  • బెంగాల్ ప్రజలు తమ భవిష్యత్తును తొలి దశలోనే నిర్ణయించుకున్నారని వెల్లడి
  • బీజేపీ నుంచి బెంగాలీయే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టీకరణ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్రమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మొదటి దశలో 152 స్థానాలకు పోలింగ్ జరిగిందని, ఇందులో 110కి పైగా స్థానాలను తాము గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోల్‌కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొదటి దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందని, ఇది మోదీ నాయకత్వంలోని అభివృద్ధికి వేసిన ఓటు అన్నారు.

అధిక ఒటింగ్ శాతం నమోదు కావడం చూస్తుంటే బెంగాల్ ప్రజలు భయాన్ని వీడి విశ్వాసం వైపు మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోందని అన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం, బెంగాల్ ప్రజలు తమ భవిష్యత్తను తొలి దశలోనే నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని అభివృద్ధి వైపు వారు మొగ్గు చూపారని అన్నారు. దీదీ (మమతా బెనర్జీ) దిగిపోయే సమయం వచ్చిందని, బీజేపీ అధికారం చేపట్టబోతోందని అన్నారు.

బెంగాల్‌లో చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరిస్తామని అమిత్ షా అన్నారు. చొరబాటురహిత బెంగాల్‌గా మార్చడమే అతిపెద్ద మార్పు అన్నారు. అవినీతి, బుజ్జగింపులు, దోపిడీ నుంచి స్వేచ్ఛ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే పాలన బయటి నుంచి ఉంటుందని మమతా బెనర్జీ చేసిన విమర్శలపై అమిత్ షా స్పందించారు.  బెంగాల్‌లోనే పుట్టి, బెంగాలీలో చదువుకుని, ఆ భాషను మాట్లాడగలిగేవారే బెంగాల్ తర్వాత ముఖ్యమంత్రిగా అవుతారని అన్నారు. కానీ ఆ అవకాశం మమతా బెనర్జీ మేనల్లుడికి రాదని, బీజేపీ కార్యకర్తకు వస్తుందని అన్నారు.

West Bengal Polls
West Bengal Elections
BJP Will win 110 seats
Amit Shah

More Telugu News